RGV Tweets on KCR: కేసీఆర్ ప్యాన్ ఇండియన్ ‘పొలిటికల్’ స్టార్.. వర్మ ట్వీట్ వైరల్!

రాంగోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా తన ట్విట్లతోనూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఏ విషయానైనా కుండబద్దలు

  • Written By:
  • Updated On - September 28, 2022 / 10:34 AM IST

రాంగోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా తన ట్విట్లతోనూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఏ విషయానైనా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం వర్మ నైజం. అందుకే ఆయన ట్విట్టర్ ఖాతాలో ఏ ట్వీట్ ప్రత్యక్షమైనా నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ట్వీట్స్ అన్నీ తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. రాంగోపాల్ వర్మ ఇటవలే లెజండరీ యాక్టర్ క్రిష్ణంరాజు కు గౌరవ సూచకంగా టాలీవుడ్ రెండు రోజులు షూటింగ్ నిలిపివేయాలని కోరిన విషయం తెలిసిందే. వర్మ ఎఫెక్ట్ తో పెద్ద హీరోలు తమ తమ సెట్స్ లో పెద్దాయనకు నివాళులు అర్పించి గౌరవించారు.

తాజాగా వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ట్వీట్ చేయడం టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సీఎం కేసీఆర్ నిజమైన పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్ అని దర్శకుడు కొనియాడారు. బాహుబలి, RRR, పుష్ప, KGF 2 ‘ సినిమాల ప్రస్తావనను గుర్తుకు తెస్తూ.. RGV, TRS కూడా BRS గా పాన్ ఇండియాగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

సినీ నటులు యష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు భిన్నంగా కేసీఆర్ నిజమైన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ఆర్జీవీ అన్నారు. మరోవైపు, భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) భారత రాష్ట్రీయ సమితి (బిఆర్ఎస్) ప్రారంభానికి సంబంధించి అనిశ్చితి ఉంది. ఈ విషయంపై పార్టీ మౌనం వహించింది. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి.