Site icon HashtagU Telugu

T Congress : కాంగ్రెస్ గూటికి రేవూరి ప్రకాష్ రెడ్డి..బాబురావు..?

Revuri Baburao Cng

Revuri Baburao Cng

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ (Congress) లోకి ఇంకాస్త వలసలు పెరిగిపోతున్నాయి. బిజెపి (BJP) , బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటీకే పలువురు చేరగా..తాజాగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ టికెట్స్ ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకుంటుంటే..రాష్ట్రంలో బిజెపి హావ మాత్రం కనిపించడం లేదని..అక్కడే ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించి కాంగ్రెస్ లో చేరుతున్నారు.

తాజాగా వరంగల్ జిల్లాలో బిజెపికి గట్టి షాక్ తగలబోతోంది. నర్సంపేట అభ్యర్థిగా నేడో రేపో ప్రకటన వెలువడే సమయంలో ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ప్రకాష్ రెడ్డి కలిశారు. ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సమ్మతించినట్లు తెలుస్తుంది. ఈనెల 18 న రాహుల్ గాంధీ సమక్షంలో రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. ప్రకాష్ రెడ్డి పరకాల సీటు ఆశిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇనుగాల వెంకటరామిరెడ్డి, కొండా మురళి, మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ టికెట్ ఆశిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేవూరికి కాంగ్రెస్ పార్టీ పరకాల సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో రేవూరి కాంగ్రెస్, టిడిపి ఆలయన్స్ లో భాగంగా వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ దఫా పరకాల మంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వనుండడంతో అటువైపు మొగ్గుచూపునట్లు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఇప్పటికే పలువురు నేతలు షాక్ ఇవ్వగా..ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు (Babu Rao) బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశ మయ్యారు. భవిష్యత్తు పరిణామాలపై చర్చించారు. ఈనెల ములుగు జిల్లా రామాజపురంలో జరగనున్న కాంగ్రెస్ భారీ సభలో ఢిల్లీ నేతల సమక్షంలో పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, రెండు సార్లు నియోజవర్గంలో గెలిచినా తనకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడంపై రాథోడ్ బాబురావు తీవ్ర సంతృప్తికి లోనయ్యారు. బుజ్జగింపు కోసం వేచి చూసిన ప్రయోజనం లేకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు కొద్ది రోజుల క్రితమే బహిరంగంగా ప్రకటించారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Read Also : Supreme Court – Gay Marriages : సేమ్ సెక్స్ వాళ్లకూ పెళ్లి చేసుకునే హక్కుంది.. కానీ.. : సుప్రీంకోర్టు తీర్పు