Group 4 Alert : గ్రూప్‌-4 అలర్ట్.. సవరించిన ఉద్యోగ ఖాళీల జాబితా రిలీజ్

Group 4 Alert : గ్రూప్-4 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 జూలైలో నిర్వహించింది. 

  • Written By:
  • Updated On - March 24, 2024 / 04:11 PM IST

Group 4 Alert : గ్రూప్-4 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 జూలైలో నిర్వహించింది.  దీని ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటనకు సవరణ ఖాళీల జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీని ప్రకారం.. గ్రూప్-4 పోస్టుల  భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు జరిగాయి. కొత్త రోస్టర్ విధానం ప్రకారం మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచారు.  జిల్లాలవారీగా కేటాయించిన ఉద్యోగ వివరాల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ లిస్టును టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.

We’re now on WhatsApp. Click to Join

  • తెలంగాణలో గ్రూప్-4 (Group 4 Alert) పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 9నే విడుదలయ్యాయి.
  • అభ్యర్థుల ర్యాంకుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
  • మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో  మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది.
  • గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించనుంది.
  • తొలుత విడుదల చేసిన గ్రూప్-4  నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
  • అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తర్వాత ఈ పోస్టులకు అదనంగా 141 పోస్టులను జతచేయడంతో.. మొత్తం పోస్టులు సంఖ్య 8,180 కి చేరింది.

Also Read : Houthis : చైనానూ వదలని హౌతీలు.. ఆయిల్ ట్యాంకర్‌పై ఎటాక్

గ్రూప్-1 అప్లికేషన్ ‘ఎడిట్ ఆప్షన్’ ఇదిగో

తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ అప్లికేషన్లకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది.

ఇలా ఎడిట్ చేసుకోండి

  • అభ్యర్థులు తొలుత https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి
  • హోంపేజీలో కనిపించే గ్రూప్ 1 సర్వీస్ ఆన్ లైన్ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • TSPSC ID, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • తప్పులు దొర్లిన కాలమ్స్ ను సవరించుకోవచ్చు.
  • తిరిగి సబ్మిట్ బటన్ నొక్కితే వివరాలు మారిపోతాయి.
  • ఒక్కసారి మాత్రం ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
  • ఈ ఎడిట్ ఆప్షన్ అవకాశం మార్చి 27న సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

Also Read :Fire in Meerut: మీర‌ట్‌లో ఘోరం.. మొబైల్ పేలి న‌లుగురు చిన్నారులు మృతి, ఇద్ద‌రి పరిస్థితి విష‌మం