Land Scam in Jubilee Hills : జూబ్లీహిల్స్ లో రూ. 2,500 కోట్ల భూ కుంభ‌కోణం

హైద‌రాబాద్ న‌డిబొడ్డున సుమారు 3వేల కోట్ల కుంభ‌కోణం వెలుగుచూసింది. రూ. 2,500 కోట్ల భూ కుంభ‌కోణం వెలుగుచూసింది.

  • Written By:
  • Updated On - September 2, 2022 / 12:58 PM IST

హైద‌రాబాద్ న‌డిబొడ్డున సుమారు 3వేల కోట్ల కుంభ‌కోణం వెలుగుచూసింది. రూ. 2,500 కోట్ల భూ కుంభ‌కోణం వెలుగుచూసింది. తెలంగాణ రెవెన్యూ అధికారులు జూబ్లిహిల్స్ లోని 54 ఎక‌రాల‌ను ఒక ప్రైవేటు రియ‌ల్డ‌ర్ కు బ‌హుమ‌తిగా ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని ఒక ఇంగ్లీషు ప‌త్రిక వెబ్ సైట్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వే నెంబరు 63లోని 54 ఎకరాల ప్ర‌భుత్వ భూమిని రెవిన్యూ అధికారులు కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ పట్టా భూమిగా ప్రకటించారు. రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22A ప్రకారం జారీ చేసిన నిషేధాజ్ఞను తొలగించి, రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేశారు.

ఇటీవల నగర ఆధారిత రియల్టీ సంస్థలపై ఆదాయపు పన్ను దాడులు క్ర‌మంలో సీజ్ చేసిన ప‌త్రాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కుదిరిన 2వేలా 500 కోట్ల భూ ఒప్పందం తెరపైకి వ‌చ్చింది. రియల్టీ సంస్థ ప్రభుత్వం నుండి అనుకూలమైన ఉత్తర్వును తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఆ ఉత్త‌ర్వు వ‌స్తుంద‌న్న‌ నమ్మకంతో కాగితంపై లేఅవుట్‌ను రూపొందించింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా చదరపు గజం రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలకు విక్రయించింది.

మణికొండలోని సక్కుబాయి లేఅవుట్‌, రాయదుర్గంలోని ఐకియా షోరూమ్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలం కేసుల్లో దత్తత తీసుకున్నట్లుగానే ప్రభుత్వం తన భూమిపై హక్కులు కోల్పోతున్నట్లు ఆ వెబ్ సైట్ వెల్ల‌డించింది. ద‌శాబ్దాలుగా రెవెన్యూ రికార్డులలో స్పష్టంగా పేర్కొనబడిన ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని సీనియర్ రెవెన్యూ అధికారులు వదులుకున్నారు. భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి న్యాయవ్యవస్థ నుండి నిర్దిష్ట ఆదేశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ 2వేల 500కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని ఆంగ్ల వెబ్ సైట్ పొందుప‌రిచింది.

రూ.2,500 కోట్ల విలువైన జూబ్లీహిల్స్‌ భూమి అంశంపై నిజాం నుంచి భూమిని పొందిన ఖాజా కరీముల్లాఖాన్‌ అనే వ్యక్తికి చెందింద‌ని ప్రైవేటు వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న‌కు చెందిన 54 ఎకరాలుగా ఆ ప్రైవేట్‌ వర్గాలు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాళ్లు చెబుతోన్న వివ‌ర‌ణ‌ను 1950ల నుండి రెవెన్యూ శాఖ మునుపటి అధిపతులతో సహా వివిధ అధికారులు తిరస్కరించారు. “పార్టీలు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అయితే ఇప్పటి వరకు ఆ భూమి వారిదేనని నిర్ధారించి, దానిని ప్రైవేట్ భూమిగా ప్రకటించాలని నిషేధ ఉత్తర్వులను తొలగించాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులు లేవు” అని వర్గాలు తెలిపాయి.

రాజధాని నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌కు ఆనుకుని ఉన్న 54 ఎకరాలతో పలువురు పెద్దలు రియాల్టీ సంస్థకు భారీ అడ్వాన్సులు చెల్లించి కాబోయే లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశారు. సంస్థ అంతర్జాతీయ స్థాయి టౌన్‌షిప్ నిర్మాణం జ‌రుగుతుంద‌ని వాగ్దానం చేయ‌డం విచిత్రం.