Bribes: రెవెన్యూ అధికారులే పట్టుబడుతున్నారు!

  • Written By:
  • Publish Date - December 31, 2021 / 11:30 AM IST

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన ప్రభుత్వోద్యోగుల్లో సగంమందికిపైగా రెవెన్యూ శాఖలో పనిచేసేవారే ఉన్నారని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. 2021లో మొత్తం 72 ట్రాప్ కేసులు నమోదవగా.. అందులో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారని తెలిపింది. లంచం తీసుకుంటూ దొరికిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్, హోం శాఖ‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారని పేర్కొంది. మొత్తం ట్రాప్ కేసుల్లో 86.11 శాతం అంటే 62 కేసులు ఈ 5 శాఖల ఉద్యోగులపైనే నమోదయ్యాయని తెలిపింది.