Revanth Tweet on KCR: దేశదిమ్మరిలా తిరగడానికి విమానం.. కేసీఆర్ పై రేవంత్ ట్వీట్!

టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) కోసం టిఆర్ఎస్ ప్రత్యేక విమానం కొనాలన్న నిర్ణయంపై

Published By: HashtagU Telugu Desk
Kcr And Revanth

Kcr And Revanth

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) కోసం పార్టీ ప్రత్యేక విమానం కొనాలన్న నిర్ణయంపై స్పందిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దేశంలో తిరిగేందుకే విమానాన్ని కొనుగోలు చేస్తున్నారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్ చక్కర్లు కొడుతోంది.

టీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఒక్కసారి కూడా పరామర్శించకపోవడంపై రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు. “ఆత్మహత్య చేసుకున్న రైతుల బంధువులను కేసీఆర్ ఓదార్చలేదు, ప్రజలను కలవడానికి ప్రగతి భవన్, ఫామ్‌హౌస్ నుండి కదలలేదు” అని రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

పది మంది టీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్‌కు చార్టర్డ్ విమానం కొనేందుకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున దాతలు అందించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారాన్ని ప్రారంభించేందుకు వీలైనన్ని ఎక్కువ నగరాలు, పట్టణాలను సందర్శించడానికి కేసీఆర్ ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. మరోవైపు కొత్త జాతీయ రాజకీయ పార్టీ నమోదు ప్రక్రియను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగవంతం చేశారు. అయితే జాతీయ పార్టీలోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తారని మీడియాలో పలు కథనాలు వచ్చాయి.

  Last Updated: 30 Sep 2022, 12:48 PM IST