Site icon HashtagU Telugu

KTR : అతి త్వరలో రేవంత్ పదవి పోవడం గ్యారెంటీ – కేటీఆర్

KTR reacts on Kaushik Reddy incident

KTR reacts on Kaushik Reddy incident

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై తన దూకుడు ను రోజు రోజుకు పెంచుతున్నాడు. రాష్ట్రంలో ప్రజలు ఎదురుచుకుంటున్న సమస్యల పై తన గళం విప్పుతూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో బిజీ బిజీ గా ఉన్న ఆయన ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్ పై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లపై కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే ఈ ఇద్దరి పదవులు పోవడం ఖాయమని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార దుర్వినియోగం చేసిన సోనియా (sonia gandhi)తో సహా చాలామంది పదవులు కోల్పోయారని ఉదహరించారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ లో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయని, RR ట్యాక్స్ ఉందని మోదీనే అంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న 8మంది బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదనిఈ సందర్బంగా కేటీఆర్ నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని..? రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్లైన్లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.

‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.

ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు. ‘హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన. ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Read Also : Dogs Attack : కేసులు మీద కాదు కుక్కల మీద దృష్టి పెట్టండి – ప్రభుత్వానికి అంబటి సూచన