CM Revanth: రేవంత్ విదేశీ టూర్ సక్సెస్, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 04:06 PM IST

CM Revanth: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి విదేశీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం ఏడు రోజుల పాటు విదేశీ పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో సిఎంఒ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐ.టి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా వివిధ కంపేనీల సిఈఒలతో చర్చించి ఒప్పంచి దాదాపు 40వేల కొట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు.

ఇక ఈ నెల 18వ తేదీన లండన్ కు సిఎం రేవంత్ రెడ్డి, ఐఎఎస్ అధికారులు దానకిషోర్, ఆమ్రపాలి తదితరులు వెళ్లారు. ఆదివారం నాడు దుబాయ్ కి వెళ్లారు.. రెండు లండన్, దుబాయిలలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటి అయిన సిఎం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇవాళ హైదరాబాదుకు చేరుకున్నారు. అయితే ఏడురోజుల విదేశీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ దావోస్ పర్యటనతో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో కొత్త రికార్డు నెలకొల్పింది.

గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు అని ప్రభుత్వ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.