CM Revanth Reddy : రేపు మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ప్రకటన..?

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 08:04 PM IST

తెలంగాణ (Telangana) లో మరో రెండు పథకాలను ( Two more Guarantees ) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందా…? అంటే అవుననే తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్..పదేళ్ల పాటు పరిపాలించింది. మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో కలలు కన్నాడు..కానీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఉద్దేశ్యం తో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లో రెండు హామీలను అమలు చేసారు. మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు పథకాలు అమలు చేసి ప్రజల్లో నమ్మకం ఏర్పరుచుకున్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని చెప్పిన హామీ ఇచ్చారు సీఎం రేవంత్.

రేపు ఫిబ్రవరి 2న మరో రెండు గ్యారంటీలు అమలు చేసేందుకు రేవంత్ (Revanth) సర్కార్ రెడీ అయినట్లు సమాచారం అందుతుంది. కేస్లాపూర్‌ నాగోబా ఆలయం నుంచి రెండు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు. రేపు ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లిలో నిర్వహించే ఈ సభకు దాదాపు లక్షమంది జనం హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వేదిక నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖం పూరించనున్న రేవంత్ మరో రెండు గ్యారంటీల అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళలకి ప్రతినెల 2,500 నగదు బదిలీ, 500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం పథకాల్లో రెండింటిని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

మహిళలకు ప్రతినెల 2,500 ఇచ్చే పథకానికి ప్రజాపాలనలో 92.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న వారిని మినహాయిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి వస్తుందనే అంశంపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఆ విధంగా లెక్క వేసినా దాదాపు 50 లక్షల మందికి ఇవ్వాల్సి రావచ్చని సమాచారం. ప్రతినెల ఎంత మొత్తం అవసరం అవుతుందో నిర్ధరణకు వచ్చి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 500కే గ్యాస్‌ సిలిండర్‌ కోసం 91.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తే దాదాపు 2,200 కోట్లకి పైగా ప్రభుత్వంపై భారం పడనుంది. ఆ రెండు అమలు చేస్తే మహాలక్ష్మీ పథకంలో పూర్తిగా నెరవేర్చినట్లు అవుతుంది. ఇది కాదనుకుంటే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేత వంటి పథకాల అమలు చేసే ఛాన్స్ కూడా ఉంది. వీటిల్లో ఏవో రెండు పధకాలకు మాత్రం రేపు రేవంత్ శ్రీకారం చుట్టడం గ్యారెంటీ అంటున్నారు. చూద్దాం రేవంత్ ఏంచేస్తారో..!!

Read Also : Uttar Pradesh: తాను చనిపోతూ 40 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్