CM Revanth : రేవంత్..’కారు’ ను ఖాళీ చేస్తాడా..?

  • Written By:
  • Updated On - March 18, 2024 / 12:52 PM IST

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కారు (BRS)ను ఖాళీ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడా..? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశామని..రేవంత్ ఓపెన్ గా చెప్పడం చూస్తే..బిఆర్ఎస్ లో ఉన్న కొద్దీ మందిని కూడా చేర్చుకొని బిఆర్ఎస్ అనేది లేకుండా చేస్తాడేమో అనిపిస్తుంది. పదేళ్ల పాటు తెలంగాణ (Telangana) లో తిరుగులేని పార్టీ గా బిఆర్ఎస్ ఎదుగుతూ వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చెప్పిందే వేదంగా నడించింది. పార్టీ లో కేసీఆర్ తీసుకేదే నిర్ణయంగా సాగింది. కేసీఆర్ కు ఎదురు చెప్పిన వారు కూడా లేరు..అలాంటిది ఇప్పుడు బిఆర్ఎస్ (BRS) అంటే షెడ్ కు సిద్దమైన పార్టీ అని అంత మాట్లాడుకునేలా అయ్యింది. పదేళ్ల పాటు కేసీఆర్ పాలన చూసి..విసిగి పోయిన ప్రజలు..ఒక్కసారి కాంగ్రెస్ కు పట్టం కట్టి చూద్దాం అని చెప్పి 65 సీట్ల తో కాంగ్రెస్ ను సీఎం కుర్చీ లో కూర్చోపెట్టారు. ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము కాకుండా ఇచ్చిన హామీలను నెరవేస్తూ వస్తుంది.

అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కీలక హామీలను అమలు చేసి కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదని నిరూపించుకుంది. దీంతో ఇతర పార్టీల నేతల్లో కూడా కాంగ్రెస్ ఫై నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ సైతం పక్క పార్టీల నేతలను ఆహ్వానిస్తుండడం తో వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతూ..కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్‌లో అవకాశం రాదని నిర్ణయించుకొని పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇందులో సిట్టింగ్ ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ఇలా చాలామందే ఉన్నారు. అందులో కొందరికి ఇతర పార్టీల్లో లోక్‌సభ టికెట్లు కూడా దక్కాయి. మరికొందరు అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే..ఇప్పటి వరకు మాజీలకు మాత్రమే గేట్లు తెరచిన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం, ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్‌లకు కూడా ద్వారాలను బారుగా తెరిచారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ నగర మాజీ మేయర్‌, ఆయన భార్య శ్రీదేవిలు చేరారు. అదేవిధంగా రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్‌ అనితా రెడ్డి, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిలు పార్టీలో చేరారు. అప్పట్లో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌లను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావించింది. కాని మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాలతో అభ్యర్ధుల విషయంలో పార్టీ నిర్ణయాలు మారుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరడంతో, పార్టీ సమీకరణాలు మారినట్లయింది.

చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డిని పోటీలో నిలపడం, అక్కడ నుంచి పోటీ చేయించాలని యోచించిన సునీతా మహేందర్‌ రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్ల తెలుస్తోంది. మరొకవైపు సికింద్రాబాద్‌ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోన్‌ బదులు దానం నాగేందర్‌ను బరిలో దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా రేవంత్ మాట్లాడుతూ..కాంగ్రెస్ డోర్స్ తెరిచామని ప్రకటించిన నేపథ్యంలో, అటు బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి టచ్‌లో ఉంటున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు ..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే త్వరలోనే కారు ఖాళీ కావడం పక్క అంటున్నారు.

Read Also : Smriti Mandhana: మ‌రోసారి బాలీవుడ్ సింగ‌ర్‌తో స్మృతి మంధాన‌.. ఫోటోకు ఫోజు ఎలా ఇచ్చిందో చూడండి..!