Revanth Reddy: అమెరికాలో తానా 23 మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తానా మహాసభలకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తానా సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. తానా మహాసభలకు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు రేవంత్.
తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ నుంచి అమెరికా వరకు తనకు దక్కుతున్న గౌరవానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుకకు అమెరికాలో సన్మానం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తానా వారు సన్మానించి వారి అభిమానం చాటుకున్నారని కొనియాడారు. తానా అభిమానం, ఆశీర్వాదంతో ప్రజల తరుపున పోరాడేందుకు మరింత ఉత్సాహాన్నిచ్చాయని, తానాకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి.
ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా హైదరాబాద్ నుండి అమెరికా వరకు నాకు దక్కుతున్న గౌరవానికి సదా రుణపడి ఉంటాను.
‘తానా’ వారి అభిమానం, పండితుల ఆశీర్వచనం ప్రజల తరపున పోరాటానికి నాకు మరింత ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చాయి. వారికి నా ధన్యవాదాలు.#TanaConference2023 pic.twitter.com/HnGzh6iqmG
— Revanth Reddy (@revanth_anumula) July 10, 2023
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వవైభవాన్ని ప్రదర్శిస్తుంది. తెలంగాణ ఇచ్చి పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ప్రస్తుతం అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ మొదలైంది. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం కాంగ్రెస్ వశమైనట్టేనని ఆ పార్టీ భావిస్తుంది. ఇలానే అన్ని జిల్లాలో కాంగ్రెస్ పాగా వేయాలని భావిస్తుంది. ఇదే జోష్ కొనసాగితే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారం చేపట్టడం ఖాయమని చెప్తున్నారు రాజకీయ నిపుణులు.
Read More: Threads: ట్విట్టర్ కు షాక్.. 100 మిలియన్లకు చేరిన థ్రెడ్ వినియోగదారుల సంఖ్య