CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తీరైన సూచనలు చేశారు. పట్టిసీమ నుంచి తీసుకెళ్లిన 90 టీఎంసీలలో 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని కేటాయించడంలో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “మేము ప్రాజెక్టులకు ఎన్ఓసీ కోరితే నిరాకరిస్తున్నారు. నికర జలాల వాడకాన్ని ఆపేస్తున్నారు. కానీ వరద జలాల విషయంలో మాత్రం వాదనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు మేల్కొనాలి, తెలంగాణను ఇరకాటంలోకి నెట్టడం మానుకోవాలి,” అని రేవంత్ హెచ్చరించారు. గతంలో జగన్ అయినా, ఇప్పుడు చంద్రబాబు అయినా గోదావరి జలాలను ఏపీ తరఫున తరలించడం కొనసాగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Kavya Maran : సోషల్ మీడియా మీమ్స్‌పై తొలిసారి స్పందించిన కావ్య మారన్
ఈ విషయంలో కేంద్రం కూడా సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఎన్నోసార్లు అధికారుల ద్వారా వివరాలు ఇచ్చినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ ఊపొచ్చేలా కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి సమర్థవంతంగా నిలబడాలి కానీ కేసీఆర్‌కు బలపరిచేలా ప్రవర్తిస్తున్నారు,” అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టినట్లు ఆరోపించిన రేవంత్, “కేసీఆర్ కుటుంబం అబద్ధాలతోనే జీవిస్తోంది. బీఆర్ఎస్ సచ్చిన పాము లాంటిదే. అసలైన పోరాటం బీజేపీతో జరగాలి,” అన్నారు. కేంద్రంపై తెలంగాణ హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “గోదావరి జలాల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లండి. ఇదే మీ మొదటి కార్యాచరణ కావాలి,” అని సూచించారు.
Costly Buffalo : రూ.14 లక్షలు పలికిన గేదె.. బన్నీ జాతి గేదెల స్పెషల్ స్టోరీ