CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

Published By: HashtagU Telugu Desk
BJP Mega Event

BJP Mega Event

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచందర్(BJP Ramachandra), సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ ప్రస్తుతం సీబీఐ వద్ద ఉందని గుర్తు చేశారు. దీంతో ఈ అంశం కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

IND vs PAK: పాక్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా ఆట‌గాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వ‌నున్నారా?

రామచందర్ వ్యాఖ్యలతో అధికార ,ప్రతిపక్ష మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. రేవంత్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి బహిర్గతం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమే చూస్తుందని BJP వర్గాలు చెబుతున్నాయి. అయితే రేవంత్ తరఫున వస్తున్న విమర్శలు కేవలం రాజకీయ ప్రహసనమని రామచందర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలు ప్రకటనలు చేసిన నేపథ్యంలో, భవిష్యత్తులో కూడా ఈ అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతూ రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల అంశం కేంద్రం పరిధిలోనిదని, గతంలో అనేకసార్లు చర్చలు జరిపినా హింస తగ్గలేదని, పెరిగిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత భద్రతా పరిస్థితుల్లో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకులు మావో సమస్యను ప్రస్తావించినా, దాని పరిష్కారం కేంద్ర స్థాయిలోనే సాధ్యమని BJP భావనను ఆయన మరోసారి స్పష్టం చేశారు. దీంతో, రాబోయే రోజుల్లో కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, మావోయిస్టు సమస్యలు తెలంగాణ రాజకీయ చర్చల్లో ప్రధానాంశాలుగా నిలవనున్నాయి.

  Last Updated: 20 Sep 2025, 05:28 PM IST