Rahul Gandhi Nomination: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాయ్‌బరేలీలో ఉంటారని పార్టీ తెలిపింది.
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపినట్లు పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ శుక్రవారం కావడంతో రాహుల్, శర్మలు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కాగా ఏడు దశల్లో జరిగే ఐదో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తున్న ఈ రెండు స్థానాలకు పోటీ చేసేవారి పేర్లపై గురువారం నుంచి పార్టీలో చర్చలు జరిగాయి. మరోవైపు రాయ్‌బరేలీ నుంచి తమ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ గురువారం ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ చేతిలో ఆయన ఓడిపోయారు. అటు బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఇప్పటికే అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
Also Read: AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?