Site icon HashtagU Telugu

Caste census Survey : రాహుల్ ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యం – సీఎం రేవంత్

Cm Speech Caste Census Surv

Cm Speech Caste Census Surv

రాహుల్ (Rahul) ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యం అన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సర్కార్‌ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే (Caste census Survey) రేపు నవంబర్ 6 నుంచి మొదలుకాబోతుంది. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించారు. ఈ సభ కు ముఖ్య అతిధిగా రాహుల్ హాజరై..కులగణన గురించి క్లుప్తంగా వివరించారు.

ఇక ఈ సభలో సీఎం రేవంత్ (CM Revanth) మాట్లాడుతూ..

కులగణన సర్వేను సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందించడంలో కీలకంగా ఉపయోగపడతుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడం తమ కర్తవ్యమని, మాటలకు కట్టుబడి ఉండే ప్రభుత్వం అని ప్రకటించారు.

సామాజిక న్యాయం కోసం కుల గణన సర్వే:

ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్యమైన లక్ష్యం సమాన అవకాశాలను అందించడం, సామాజిక న్యాయం కల్పించడం అని సీఎం పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా అన్ని వర్గాల వారికి తమకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా చూడవచ్చని, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లను న్యాయంగా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గ్రూప్ 1 పరీక్ష గణాంకాలు:

ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల కుల గణాంకాలను చూపిస్తూ, కులగణన పట్ల ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధిని రేవంత్ వెల్లడించారు. ఎంపికైన 31,383 మందిలో ఓసీలు 9.8%, ఈడబ్ల్యూఎస్ 8.8%, ఓబీసీలు 57.11%, ఎస్సీలు 15.3%, ఎస్టీలు 8.8% ఉన్నారని వివరించారు.

పౌర సమాజం సూచనలు:

ఈ సర్వే విషయంలో పౌర సమాజం నుండి సూచనలు తీసుకోవడం చాలా ముఖ్యమని రాహుల్ గాంధీ నేరుగా హాజరై మాట్లాడినట్లు చెప్పారు. కుల వివక్షను తొలగించడానికి, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడంలో కుల గణన సర్వే కీలకంగా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు.

Read Also : Caste census Survey : కులగణనపై రాహుల్ కీలక వ్యాఖ్యలు