CM Revanth Reddy : మోడీకి గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చింది – సీఎం రేవంత్

బిజెపి మత పిచ్చితో కొట్టుకుంటుందని ..అలాంటి మతపిచ్చి పార్టీని దేశం నుండి తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 08:58 PM IST

లోక్ సభ ఎన్నికల ప్రచారం (Lok Sabha Election Campaign)లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరంగల్ లో ఏర్పాటు చేసిన జన జాతర (Warangal Jana Jathara Meeting) సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోడీ (Modi) , కేసీఆర్ (KCR) లపై నిప్పులు చెరిగారు. ఈ లోక్ సభ ఎన్నికలతో మోడీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి మత పిచ్చితో కొట్టుకుంటుందని ..అలాంటి మతపిచ్చి పార్టీని దేశం నుండి తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానంటూ తెలంగాణ ప్రజలను మోడీ మోసం చేసారని , బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పటు చేయలేదని, కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారంటూ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని చెప్పిన మోడీ..ఈరోజు రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని విమర్శించారు. ఇక భూములు ఆక్రమించుకున్న ఆరూరి రమేష్ అంగీ మార్చి, రంగు మార్చి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఏ రూపంలో వచ్చినా.. ఏ వేషంలో వచ్చినా ఆరూరి రమేష్ ను ప్రజలు బండకేసి కొట్టడం మాత్రం తప్పదని జోష్యం తెలిపారు. భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తెల్చుకోవాలంటూ వరంగల్ ప్రజలకు కోరారు. వరంగల్ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించాలంటూ సీఎం ప్రజలను కోరారు. ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి ప్రజల భూములను మింగేస్తాడని ఆరోపించారు.

కావ్యను గెలిపిస్తే..వరంగల్ లో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేసి మహర్దశ కల్పిస్తాం.. వరంగల్ నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. నేనే స్వయంగా వచ్చి వరంగల్ లో కూర్చుని నగర సమస్యలను పరిష్కరిస్తా.. కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం. ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపుచూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది’ అని రేవంత్ హామీ ఇచ్చారు.

Read Also : Virupaksha : ‘విరూపాక్ష’ సినిమా బిగ్‌బాస్ నటుడితో చేయాల్సింది.. కానీ సాయి దుర్గ తేజ్..