Site icon HashtagU Telugu

Narsapur : బీజేపీ వాళ్లు మనకు సాంప్రదాయాలు నేర్పాలా..? రేవంత్ సూటి ప్రశ్న

Revanth Nsp

Revanth Nsp

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరిగారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే బీజేపీకి అప్పుడు రాముడు గుర్తొస్తాడని, మన తాతలు శ్రీరామనవమి చేయలేదా..? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి..ఈ బీజేపీ వాళ్లు మనకు సాంప్రదాయాలు నేర్పేది అంటూ బిజెపి ఫై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.పోలింగ్‌ బూత్‌లో ఓట్ల కోసం దేవుడి పేరును వాడుకోవద్దని విమర్శించారు. రాష్ట్రానికి బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ అడిగితే, మోడీ గాడిద గుడ్డు ఇచ్చారని , తెలంగాణకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిన మోడీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫై కూడా రేవంత్ కీలక ఆరోపణలు , విమర్శలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయన కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, కరీంనగర్ నుంచి తీసుకొచ్చి వెంకట్రామిరెడ్డిని పోటీ చేయిస్తున్నారని అన్నారు. దుబ్బాక ప్రజలను మోసం చేసిన వ్యక్తే ఇవాళ మెదక్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చనందునే రఘునందన్‌ రావు ఓడిపోయారని అన్నారు. ప్రజల భూములు లాక్కున్న వ్యక్తి బీఆర్ఎస్​ తరఫున ఎంపీగా పోటీలో ఉన్నారన్న సీఎం, భూనిర్వాసితులను మోసం చేసిన వెంకట్రామిరెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా మెదక్ ప్రాంతం బీజేపీ, బీఆర్ఎస్ చేతుల్లో మగ్గిపోయిందని, ఆ పార్టీల నుంచి విముక్తి పొందేలా ఈ దఫా కాంగ్రెస్​ పార్టీని ప్రజలు గెలిపించాలని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు.

Read Also : Mudragada Padmanabham : వైసీపీకి ముద్రగడ పెద్ద మైనస్‌గా మారారా?