Revanth : రేవంత్ కోవ‌ర్టు రాజ‌కీయంపై `ఈటెల`అస్త్రం, కాంగ్రెస్ లోకి ఆహ్వానంపై ఫైర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth)ఉద్య‌మ‌కారుడు, ఈటెల రాజేంద్ర కౌంట‌ర్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - January 28, 2023 / 04:43 PM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth)ఉద్య‌మ‌కారుడు, బీజేపీ లీడ‌ర్ ఈటెల రాజేంద్ర(Rajendra) కౌంట‌ర్ ఇచ్చారు. ఏడాదికో పార్టీ మ‌రే లీడ‌ర్ ను కాదంటూ ప‌రోక్షంగా రేవంత్ రెడ్డికి చుర‌క‌లు వేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌ని రేవంత్ రెడ్డి మీడియాముఖంగా ఆహ్వానించ‌డాన్ని ఈటెల సీరియ‌స్ గా తీసుకున్నారు. ఏక వాక్యంతో ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్కరిస్తూ ప్ర‌జా బ‌లాన్ని న‌మ్ముకున్నాన‌ని హిత‌బోధ చేశారు. ఎవ‌రి సానుభూతి అవ‌స‌రంలేదంటూ వ్యంగ్యాస్త్రాల‌ను రేవంత్ రెడ్డి మీద విసిరారు. కోవ‌ర్టుల అంశాన్ని ఈటెల ప్ర‌స్త‌వించారు. వ్యూహాత్మ‌కంగా కొంద‌రు కోవ‌ర్టుల‌తో బీజేపీ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేస్తున్నార‌ని ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిని ఈటెల టార్గెట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి  ఈటెల రాజేంద్ర  కౌంట‌ర్ (Revanth)

కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుంచి కోవ‌ర్టుల వ్య‌వ‌హారం వినిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోవ‌ర్టులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నార‌ని ఫిర్యాదులు కూడా ఢిల్లీకి వెళ్లిన విష‌యం విదిత‌మే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth) వాల‌కాన్ని త‌ప్పుబ‌డుతూ కో వ‌ర్టు రాజ‌కీయాలు చేయొద్ద‌ని ప‌రోక్షంగా ఢిల్లీ వేదిక‌గా హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇత‌ర పార్టీల్లోని స‌మాచారాన్ని తెలుసుకోవ‌డానికి కేసీఆర్ కొంద‌రు కోవ‌ర్టుల‌ను పెట్టుకున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనూ కోవ‌ర్టుల‌ను పెట్టుకుని త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ను బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని చూస్తున్నాడ‌ని అనుమానించారు. ఇతర పార్టీల ఉనికిని తగ్గించడం, పెద్ద నాయకుడిగా చూపించడం కేసీఆర్ వ్యూహం. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీలను ఇలా మింగేశాడ‌ని ఈటెల ఉద‌హ‌రించారు. పోలీసు వ్యవస్థ, కుట్రలు, డబ్బును ఉపయోగించి ప్రజలను ప్రలోభపెట్టడం ద్వారా పైకొచ్చాడ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు నా చరిత్ర తెలుసునని, వారి మద్దతు ఎప్పుడూ ఉంటుందని రాజేందర్ (Rajendra) ప్ర‌క‌టిస్తూ రేవంత్ రెడ్డి మీద కోవ‌ర్టు బాణాన్ని ప‌రోక్షంగా సంధించారు.

Also Read : Revanth Arrest: టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్!

తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో నాలుగు ర‌కాల కోవ‌ర్టులు ఉన్నార‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. కేసీఆర్ కాంగ్రెస్, క‌విత కాంగ్రెస్, కేటీఆర్ కాంగ్రెస్, హ‌రీశ్ రావు కాంగ్రెస్ అంటూ నాలుగు ర‌కాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అందుకే, 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే, వాళ్లు బీఆర్ఎస్ వైపు వెళ‌తార‌ని ఇప్ప‌టి నుంచే బీజేపీ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది. ప్ర‌జ‌లు కూడా విశ్వ‌సించ‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

కేసీఆర్ కోవ‌ర్టు రాజ‌కీయానికి రేవంత్ స‌హ‌రిస్తున్న తీరుగా

బీజేపీలోకి వెళ్లిన ఈటెల‌ను బ‌ల‌మైన రాజ‌కీయ‌నాయ‌కునిగా బీఆర్ఎస్ భావిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల త‌రువాత ఈటెల బ‌లం ఏమిటో కేసీఆర్ రుచిచూశారు. దీంతో ఆయ‌న్ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి బీజేపీని వీడుతున్నాడ‌ని ప‌లు సంద‌ర్భాల్లో బీఆర్ఎస్ కోవ‌ర్టు రాజ‌కీయాన్ని న‌డిపింది. ఆ విష‌యాన్ని చెబుతూ కేసీఆర్ కోవ‌ర్టు రాజ‌కీయానికి రేవంత్ స‌హ‌రిస్తున్న తీరుగా త‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ‌డం ఉంద‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడే ఇదే కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయింది.

Also Read : Revanth Vs Seniors : టీకాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు.. రేవంతే టార్గెట్‌గా సీనియర్ల బ్లాస్ట్!