Site icon HashtagU Telugu

CM Revanth : సినిమా వాళ్లతో రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నాడు – కేటీఆర్

Movie Artist Meets Cm Revan

Movie Artist Meets Cm Revan

ప్రజా సమస్యల (Public Issues) నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ను (Allu Arjun) సీఎం రేవంత్ టార్గెట్ (CM Revanth Target) చేశారని కేటీఆర్(KTR) ఆరోపించారు. సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్ చేసుకున్నారని, అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై ఏం మాట్లాడట్లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్‌ ను సీఎం టార్గెట్ చేసారని కేటీఆర్ ఆరోపించారు. సినిమా వ్యక్తులతో సెటిల్మెంట్ చేసుకున్నారు కాబట్టి అంత సైలెంట్ అయ్యారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్న పరిస్థితుల్లో ప్రజల విమర్శలు తప్పించుకోవడానికి అల్లు అర్జున్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా గురుకుల్లో విద్యార్థుల మరణాలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, రైతులు, నేతన్నల పరిస్థితులపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతను విస్మరించి, రాజకీయ లబ్ధి కోసం ప్రాధాన్యతల నుండి దృష్టి మళ్లిస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దురదృష్టకరమైన సంఘటనలకు బాధ్యులైన కుటుంబాలకు కనీసం రూ. 25 లక్షల పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా వ్యవహారాన్ని కూడా ప్రభుత్వ డైవర్షన్ పథకంలో భాగంగా తీసుకువచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో కీలకమైన సమస్యలను పక్కదారి పట్టించి, ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యలపై ప్రభుత్వ స్పందన లేకుంటే, ప్రజల నుండి విమర్శలు తప్పవని అన్నారు.

Read Also : Tata Motors : ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టాటా మోటార్స్..