Site icon HashtagU Telugu

Hydraa : హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చిన రేవంత్ సర్కార్

High Court HYDRA Commissioner Ranganath

హైడ్రా (Hydraa ) కు ఇప్పటికే పలు అధికారాలు ఇచ్చిన సర్కార్ (Telangana Govt)..ఇప్పుడు మరిన్ని అధికారాలు ఇచ్చి ఎక్కడ తగ్గొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోనూ అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్..ముందుగా భాగ్యనగరం ఫై దృష్టి సారించారు. చెరువులు , ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను తొలగించేందుకు హైడ్రా ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వందల అక్రమ నిర్మాణాలను కూల్చేసి ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే కూల్చివేతలకు ముందుగా బాధితులకు నోటీసులు జారీ చేయడం.. ఆ తర్వాత బాధితులు అక్రమ కట్టడాలు తొలగించని యెడల, హైడ్రానే వాటిని కూల్చేయడం చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా (Hydra) పై సోషల్ మీడియా వేదికగా.. పలు విమర్శలు సైతం వచ్చాయి. ఈ విమర్శలకు హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు.

కాగా ఇటీవల పలువురు రాజకీయ పార్టీల నాయకులు, హైడ్రాపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ విమర్శలు సైతం చేశాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించి, పూర్తి అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ దశలో హైడ్రా (Hydra) కు చట్టబద్దత కల్పించి.. ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు సైతం వేసింది.

గత నెల 20వ తేదీన హైడ్రా (Hydra) కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించింది. అనంతరం కేబినెట్ ఆమోదం తెలపగా, ఆర్డినెన్స్ పై సంతకం కోసం హైడ్రా చట్టబద్ధత ఫైల్ ను రాజ్ భవన్ ( Raj Bhavan) కు ప్రభుత్వం పంపింది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసి ఆర్డినెన్స్ జారీ చేశారు. జారీ చేసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం గెజిట్ ను సైతం విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్ 6 నెలల్లోనే చట్టంగా రూపొందే అవకాశాలు కనిపిస్తుండగా.. అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి హైడ్రాకు సభ్యుల ఆమోదం లభించిన అనంతరం.. ఇక చట్టబద్ధత హోదా హైడ్రా కు కలుగుతుంది.

Read Also : Canada : వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు అంత కష్టపడాలా..?

Exit mobile version