Site icon HashtagU Telugu

Congress Govt : రాష్ట్రంలో దసరా సంబరాలు లేకుండా చేసిన రేవంత్ సర్కార్ – కేటీఆర్

Ktr Cng

Ktr Cng

కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) పై బిఆర్ఎస్ (BRS) మాటల యుద్ధం రోజు రోజుకు పెంచుతుంది. ప్రతి అంశంపై తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టేందుకు ట్రై చేస్తూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయకపోవడం..చేసిన పలు హామీలు సైతం పూర్తి స్థాయిలో చేయకపోవడంపై విమర్శలు చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో ఇల్లు కూల్చే వేతల పై ఘాటుగా స్పందిస్తూ వస్తుంది.

ఇక BRS వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) అయితే సోషల్ మీడియా లో వేదికగా నిత్యం విమర్శలు , సవాళ్లు కురిపిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో దసరా పండుగ వాతావరణం కనపడటం లేదని KTR అన్నారు. ‘ఆడబిడ్డలకు చీరలు లేవు. రైతులకు రైతుబంధు లేదు. ఆఖరికి బతుకమ్మ ఆడేందుకు డీజేలు కూడా లేవు. ఏ అధికారి తమ ఇంటికి వచ్చినా ఇల్లు కూల్చేస్తారని ప్రజలు భయపడుతున్నారు అని పేర్కొన్నారు.

బుధువారం కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అలావుద్దీన్ ప‌టేల్ స‌హా ఆయ‌న అనుచ‌రులు తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ స‌మక్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి. ఈ సారి పండుగ… పండుగ మాదిరిగా లేకుండా పోయింది. రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు. వరంగ‌ల్‌లో ఓ ఎమ్మార్వో బతుకమ్మ ఘాట్ చూసేందుకు వెళితే ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని వాళ్లను స్థానికులు తరమికొట్టారట. అలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న ఆఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను తలచుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పది నెలల వాళ్ల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు.

కేసీఆర్ జాబ్ పొగొట్టండి. మీకు ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చాడు. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని కేటీఆర్ తెలిపారు. మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నాడు. కోటి 60 లక్షల మంది మహిళలు రూ. 2500ల కోసం వేచి చూస్తున్నారు. వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ అన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా? అంటే లేనే లేదు. ఉన్న రైతు బంధు, ఉన్న పింఛన్ కూడా వస్తలేదు. వాళ్లు 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైనయ్ అంటే సమాధానం చెబుతలేడు. కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం ఇనుము కూడా ఇవ్వడని కేటీఆర్ విమ‌ర్శించారు.

Read Also : Kim Jong Un : సరిహద్దుల మూసివేత.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం