CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6 నుంచి 11 వరకు ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ఒకవైపు టీపీసీసీ చీఫ్, మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ రాజకీయ పర్వంలో దూసుకుపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిచేత్తో కాంగ్రెస్ కు గెలుపు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, లోక్ సభ ఎన్నికల్లో అదే జోష్ తో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల విధానాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6 నుంచి 11 వరకు ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు.

ప్రచారం టూర్ షెడ్యూల్..

తేదీ:06-05-2024

5PM-అంబర్ పేట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

7.30PM- ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

9PM- సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్

తేదీ: 07-05-2024

4PM- కరీంనగర్ జన జాతర సభ

6.30PM- వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

7.45PM- వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

తేదీ: 08-05-2024

5PM- ఆర్మూర్ కార్నర్ మీటింగ్

7PM- నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

ఈ నెల 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ పర్యటన

తేదీ: 09-05-2024 (రాహుల్ గాంధీ పర్యటన)

4PM- నర్సాపూర్ జన జాతర సభ

6PM- ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జన జాతర సభ

తేదీ: 10-05-2024 (ప్రియాంక గాంధీ పర్యటన)

12PM- కామారెడ్డి జన జాతర సభ

4PM- తాండూరు జన జాతర సభ

6PM- షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

తేదీ: 11-05-2024

10AM- పఠాన్ చెరు రోడ్ షో, కార్నర్ మీటింగ్..

3PM-మక్తల్ జన జాతర సభ

  Last Updated: 06 May 2024, 12:01 PM IST