CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం ఆయా కంపెనీలతో సమావేశం అవుతున్నారు. సంస్థల ప్రతినిధులతో మాట్లాడి హైదరాబాద్ నగర ప్రతిష్టను తెలియజేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్, నెట్ జీరో, ప్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. అంతేకాకుండా నగరంలో పెట్టుబడులు పెడితే సదరు సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుందో చెప్తూ వారిని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
ఆగస్ట్ 8 వరకు కుదిరిన ఒప్పందాలు:
1. కాగ్నిజెంట్:
అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు.
2. వాల్ష్ కార్రా హోల్డింగ్స్:
WE-హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి.
3. ఆర్సీసియం:
దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు.
4. స్వచ్ఛ్ బయో:
రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు.
5. ట్రైజిన్ టెక్నాలజీస్:
హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవెలప్మెంట్, డెలివరీ సెంటర్. దాదాపు 1000 ఉద్యోగాలు.
6. హెచ్‌సీఏ హెల్త్ కేర్:
నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.
7. కార్నింగ్:
గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం.
8. వరల్డ్ బ్యాంక్:
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం.
9. వివింట్ ఫార్మా:
రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు.
10. చార్లెస్ స్క్వాబ్:
హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్.
Also Read: OLA Electric IPO Listing: ఫ్లాట్‌గా ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ లిస్టింగ్.. లాభాల్లేవ్- నష్టాల్లేవ్..!