Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ లేఖ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఫైర్

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలింగ్ సమయం పడుతుండటంతో మరింత దూకుడు పెంచారు.

  • Written By:
  • Updated On - November 24, 2023 / 05:07 PM IST

Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలింగ్ సమయం పడుతుండటంతో మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వన్ మ్యాన్ షో స్టైల్ లో కాంగ్రెస్ ప్రచారమంతా తనపై వేసుకొని తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలతో మరుగున పడే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని లేఖలో కోరారు. ‘బీజేపీ-బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నాయి. రాజకీయ క్రీడలో రాజ్యాంగ వ్యవస్థలను మోదీ, కేసీఆర్ పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వాళ్లు పుణ్యాత్ములు.. మరో పార్టీలో చేరి ద్రోహులా? ఆ దేశంలో.. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తున్నారు.

ఇది బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య కుదిరిన ఉమ్మడి కార్యక్రమం’’ అని లేఖలో పేర్కొన్నారు. కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివో? ఈ సోదాల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్న దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లు, కార్యాలయాల వైపు కన్నెత్తి కూడా చూడవని అన్నారు. కాంగ్రెస్ నేతలైన పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల, వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నాయని అన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు కాంగ్రెస్‌ లో చేరగానే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఐటీ దాడుల పేరుతో జరుగుతున్న కవ్వింపు చర్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత కసి పెంచాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరెన్ని దాడులు చేసినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ సిట్టింగ్ అలంపూర్  ఎమ్మ్యెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Also Read: TCongress: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి అలంపూర్ ఎమ్మెల్యే జంప్!