Site icon HashtagU Telugu

Telangana Politics: రైతుతో రాజకీయమా ?

Telangana Politics

New Web Story Copy 2023 07 16t173015.794

Telangana Politics: సెంటిమెట్ రాజేసి రాజకీయాలు చెయ్యడం ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న పని. నమ్మించి మోసం చెయ్యడం కూడా అదే రాజకీయ నాయకుడి లక్ష్యం. కానీ ఓటర్ అనే ఒక వ్యవస్థ ఉంది, ఓటర్లు హామీలు గుర్తు పెట్టుకుంటారు, సమయం వచ్చినప్పుడు మెడలు విరుస్తారు అన్న సోయి లేకుండా హామీలు ఇవ్వడం కూడా మన రాజకీయ నాయకుల అతిపెద్ద లక్షణం. విషయానికి వస్తే తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ నాయకులకు రైతులు గుర్తొస్తున్నారు. మెజారిటీ ఓటు బ్యాంకు రైతులే కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి బయలుదేరుతున్నారు.

బిఆర్ఎస్ రైతుతో రాజకీయం చేసేందుకు బయలుదేరిందని ఆరోపించారు తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులకు ఇచ్చిన హామీలను మరిచి ఇప్పుడు రైతులతో రాజకీయానికి సిద్ధపడుతోందని మండిపడ్డారు. చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారని అయితే రైతులకు ఇచ్చిన రైతు రుణ మాఫీ మాత్రం అమలు కాలేదంటూ సీఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ మేరకు తెలంగాణ రైతాంగానికి రేవంత్ లేఖ రాశారు. ఇచ్చిన హామీలు పరిష్కరించుడో, బిఆర్ఎస్ ని బొందపెట్టుడో తేల్చుకుందాం అంటూ రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్ అన్నారు రేవంత్. 24 గంటలు ఇస్తానని నమ్మించి మోసం చేసి కేవలం 10 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులు అయితే 4 లక్షల మందికి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పి మోసం చేసినట్లు ఆరోపించారు రేవంత్. గత 9 ఏళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. ఇలా తెలంగాణ రైతుల్ని, పేదలను మోసం చేసి మరోసారి ఎన్నికలకు సిద్దమవుతున్నాడు కెసిఆర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Read More: Volunteers Issue: వాలంటరీర్ల జోలికి వస్తే అంతు చూస్తాం