Site icon HashtagU Telugu

Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ ప్రమాదం.. పలు కార్లు ధ్వంసం!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. శనివారం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాన్వాయ్‌ ను ఫాలో అవుతున్న పలు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమవ్వగా.. పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు సమాచారం. అయితే గట్టిగా ఢీకొనడంతో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పెను ప్రమాదం తప్పినట్లైంది.

పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగ్గపోవడంతో సెక్యూరిటీ (Sucurity) సిబ్బంది ఊపీరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తన పాదయాత్రకు ప్రభుత్వపరంగా సెక్యురిటీ పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.