Revanth Reddy: పంటనష్టంపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ

‘‘రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 06:16 PM IST

‘‘రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు నీట మునిగి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జోరువానతో.. అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మీరేమో ఇవే పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ రైతు బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి గానీ, వ్యవసాయ విభాగం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

విత్తనాలు మొలక స్థాయిలోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తకుండా వర్షాల వల్ల మురిగిపోతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, వానల కారణంగా మళ్లీ విత్తనాలు వేయడమో, నారు పోసుకుని నాట్లు వేయడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి  కేసీఆర్ కు రాసిన లేఖలో వివరించారు.

డిమాండ్లు

  • భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.
  • తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
  • కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలి.
  • తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.