Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..

రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 03:19 PM IST

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గరికి వస్తున్నకొద్దీ తెలంగాణ లో అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress -BRS) పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. అయితే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) మాత్రం నిత్యం అవే కామెంట్స్ తో బోర్ కొట్టిస్తున్నాడు. ముఖ్యంగా రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ గత కొద్దీ రోజులుగా ఎక్కడికి వెళ్లిన ఏ సభ వేదికైన అవే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు కూడా మరోసారి అదే తరహాలో కామెంట్స్ చేసారు కేటీఆర్. ఆదిలాబాద్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు సీఎం రేవంత్ రెడ్డే నని , గెలిచిన ఎంపీలతో ఆయన బీజేపీలో చేరతారని మరోసారి బాంబు పేల్చారు. కేటీఆర్ కామెంట్స్ విన్న కాంగ్రెస్ శ్రేణులు పదే పదే ఒకే పాటనా కేటీఆర్ కాస్త మార్చరాదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ పక్క లోక్ సభ ఎన్నికల్లో బిజెపి – బిఆర్ఎస్ రెండు కలిసే దిగుతున్నాయని..ఇద్దరు బయటకు వేరే వేరు కానీ లోపల మాత్రం ఇద్దరు ఒక్కటే అని ప్రచారం నడుస్తుంటే..కేటీఆర్ మాత్రం మాట్లాడిన ప్రతిసారి రేవంత్ బిజెపి లో చేరబోతున్నాడని అన్నడం హాస్యాస్పదం గా ఉందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.

ఇదిలా ఉంటె ఈరోజు సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఆందోల్(Andol) నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో బిఆర్ఎస్ ప్రజా అశీర్వాద సభ(Praja Ashirvada Sabha) జరగనుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్‌ రావు, మెదక్, జహీరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. మరి ఈ సభలో కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారో చూడాలి.

Read Also : Sleep : నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం..రాత్రంతా ప్రశ్నించడం సరికాదుః బాంబే హైకోర్టు