Site icon HashtagU Telugu

CM Revanth Reddy : రేవంత్ స్పందించడం లేదంటే..బీజేపీలో చేరబోతున్నట్లే – కేటీఆర్

Revanth Bjp

Revanth Bjp

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫై మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేసారు. గత కొద్దీ రోజులుగా కేటీఆర్ (KTR)..సీఎం రేవంత్ బిజెపి (BJP) లో చేరబోతున్నాడని ..ఇది ఖచ్చితంగా జరగబోతుందని..మీరంతా ఇది చూస్తారని పదే పదే వేదిక ఏదైనా సరే..కేటీఆర్ ముందుగా ఇలాగే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు కూడా అదే కామెంట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని మరోసారి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే నేను దీనిని 15 సార్లు ప్రస్తావించాననని.. ప్రపంచంలో జరిగే చిన్న విషయాలకు స్పందించే రేవంత్ రెడ్డి.. బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికి వరకుఎందుకు స్పందించడం లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సౌత్ ఇండియా నుంచి ఒక కీలక నేత బీజేపీలో చేరుతారని అన్నారు. అందుకే సీఎం రేవంత్ పదే పదే మోడీని మేరా బడే భాయ్ అంటూ ఉంటారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

Read Also : Pithapuram Politics : పిఠాపురంలో వైసీపీలో గందరగోళం.. జనసేనాని గెలుపు ఖాయం..!