Site icon HashtagU Telugu

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం, నిరుద్యోగురాలికి రేవంత్ రెడ్డి హామీ!

Revanth Reddy Comments on BRS Candidates List

Revanth Reddy Comments on BRS Candidates List

Revanth Reddy:  కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకను క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తాము అధికారంలోకి వస్తున్న ధీమానే ప్రజల్లోకి తీసుకెళ్తుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందస్తుగానే హామీల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ తోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఆయన విద్యార్థుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నాంపల్లి కి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు ) రజినీ అనే అమ్మాయికి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని తేల్చి చెప్పారు.

పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాకపోవడం, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదనే ఆవేదనను వికలాంగులు రజనీ ఆవేదనను రేవంత్ రెడ్డి అర్ధం చేసుకున్నారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం ఉంటదని, సోనియా రాహుల్ ఖర్గే వస్తారని, అదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తదిని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపారు రేవంత్ రెడ్డి.

హాస్టల్‌లో ఉరివేసుకుని ప్రవళిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, TSPSC కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగ హామీలు ఇస్తోంది.