Congress Jana Garjana: డీజీపీకి రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఖమ్మం వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించనుంది. ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తుండటంతో

Congress Jana Garjana: ఖమ్మం వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించనుంది. ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభ బీఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. దీంతో సభకు వచ్చే కార్యకర్తల్ని అడుగడుగున అడ్డుకుంటున్నారు. 5 లక్షల మందితో సభను విజయవంతం చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. అందుకు అనుగుణంగా భారీ జన సమీకరణ కోసం వేలాది వాహనాలను అందుబాటులో ఉంచింది కాంగ్రెస్. అయితే సభకు వచ్చే జనాన్ని ఆడుకుంటున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రజలను అడుగడుగునా అడ్డుకోవడంపై పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు డీజేపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను, ప్రజలను ఆర్టీఏ అధికారులు చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్న విషయాన్నీ అంజనీ కుమార్ కు చెప్పాడు. ఈ విషయంలో పరిస్థితి చేయి దాటిపోతే డీజేపీ బాధ్యత వహించాలని అన్నారు రేవంత్. ఇప్పటికే వందలాది మంది ప్రజలని వెనక్కి పంపించినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ సభ ద్వారా కెసిఆర్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు.

Read More: Ajit Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్.. ఎన్సీపీ నేత తిరుగుబాటుకు కారణమేంటి..?