Site icon HashtagU Telugu

CM Revanth: భార్యావియోగంతో దుఖంలో ఉన్న ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్

Cm Revanth

Cm Revanth

CM Revanth: కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భర్తతో విభేదాలు ఉన్నట్లు సమాచారం.

భార్యావియోగంతో దుఖంలో ఉన్న ఎమ్మెల్యే సత్యంను సీఎం రేవంత్ కలిసి పరామర్శించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Also Read: Poonam Kaur : పూనమ్ కీలక ట్వీట్స్..కూటమి విజయం పైనేనా..?