Revanth Reddy : ఎవ‌రి పాలయిందో తెలంగాణ‌.. ట్వీట్ వైర‌ల్‌

ఎవ‌ని పాల‌యిందో తెలంగాణ..అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ''దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది.

  • Written By:
  • Updated On - May 13, 2022 / 03:47 PM IST

ఎవ‌ని పాల‌యిందో తెలంగాణ..అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ”దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణ జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ” అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్ కు భూమి కేటాయిస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్వ‌ర్వును ఆయ‌న పోస్ట్ చేశారు. హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కోసం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని స‌ర్కారు కేటాయించింది. అది హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట మండలం ఎన్బీటీ నగర్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 వద్ద సర్వే నంబర్‌ 18/పీ, 21/పీలో ఉంద‌ని అందులో ఉంది.

మ‌రోవైపు, పాలమూరు నుంచి ప్ర‌జ‌ల వ‌ల‌స‌లు ఆగ‌ట్లేద‌ని రేవంత్ రెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. ”అయ్యాకొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగునపడ్డాయి. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు. పాలమూరు పచ్చబడ్డదన్నది జూటామాట. సందేహం ఉంటే క్షేత్రానికి వెళ్లి నిజనిర్ధారణ చేద్దాం. వచ్చే దమ్ముందా కేటీఆర్!?” అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. మొత్తం మీద తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత రాష్ట్రం దొర‌ల‌పాల‌యింద‌ని పార్టీ ఆఫీస్ కు రూ. 100కోట్ల విలువైన స్థ‌లాన్ని దోచేయ‌డంతో బోధ‌ప‌డుతోంది.