Site icon HashtagU Telugu

Revanth Reddy Telangana CM : ప్రగతి భవన్ కంచెను బద్దలు కొట్టడం మొదలైంది – రేవంత్

Revanth Cm Pramana

Revanth Cm Pramana

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ తమిళసై..రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 11 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

మల్లు భట్టి విక్రమార్క (డిప్యూటీ సీఎం)

ఉత్తమ్ కుమార్ రెడ్డి (మంత్రి)

దమోదరరాజ నర్సింహ (మంత్రి)

కోమటిరెడ్డి వెంకటరెడ్డి (మంత్రి)

దుద్దిళ్ల శ్రీధర్ బాబు (మంత్రి)

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (మంత్రి)

పొన్నం ప్రభాకర్ (మంత్రి)

కొండా సురేఖ (మంత్రి)

సీతక్క (మంత్రి)

తుమ్మల నాగేశ్వరరావు (మంత్రి)

జూపల్లి కృష్టారావు (మంత్రి)

అనంతరం రేవంత్ మాట్లాడుతూ..జై సోనియమ్మ.. జైజై సోనియమ్మ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు రేవంత్. మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు అని, ఈ రాష్ట్రం త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి రాష్ట్రంలోని 4 కోట్ల మంది జనాలకు స్వేచ్ఛ ఇవ్వాలని సామాజిక న్యాయం చేయాలని అసిఫాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలుపెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’’ అని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

దశాబ్దకాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనై, మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్దకాలం మౌనంగా భరించిన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనలను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలను చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది’’ అని చెప్పుకొచ్చారు.

రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ వద్ద ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబోతున్నామని.. ఎవరు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నన్ను కలిసి తెలంగాణ అభివృద్ధిపై మీ ఆలోచనలు పంచుకోవచ్చు అని తెలిపారు. పదేళ్లుగా ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను బద్దలుకొట్టడం జరిగింది అని చెప్పుకొచ్చారు. ఈ మంత్రివర్గంతో తెలంగాణకు సామాజిక న్యాయం జరుగుతుంది అన్నారు.
అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం అని తేల్చి చెప్పారు.

ఇక రేవంత్ రెడ్డి రెండు ఫైల్స్ ఫై సంతకాలు చేసారు. మొదటిది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం , రెండవ సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామకం పత్రంపై చేశారు.

Read Also : Rise of Revanth Reddy.. : రైజ్ ఆఫ్ రేవంత్..