Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు

ప్రధాన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా.. ప్రధాన వేదికకు ఎడమవైపున ఉన్న వేదికపై 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు

Published By: HashtagU Telugu Desk
Revanth Praanam

Revanth Praanam

మరికాసేపట్లో తెలంగాణ రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం (Swearing Ceremony) చేయబోతున్నారు. ఈ వేడుక హైదరాబాద్ లోని LB స్టేడియం (LB Stadium) లో అట్టహాసంగా జరగబోతుంది. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా.. ప్రధాన వేదికకు ఎడమవైపున ఉన్న వేదికపై 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.

అలాగే కుడి వైపున ఉన్న వేదికపై 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఈ వేదికను వీవీఐపీలకు కేటాయించారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో మరో గ్యాలరీని, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇక స్టేడియంలో 30 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాదు ఈ కార్యక్రమాన్ని స్టేడియం బయట ఉన్న వారు వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా LB స్టేడియం కు చేరుకున్నారు. అలాగే సోనియా , రాహుల్ , ప్రియాంక గాంధీలు తాజ్ నుండి స్టేడియం కు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, శేరి బ్యాండ్ కళాకారులు రేవంత్‌కు స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకోనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు. మార్గమధ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు.

Read Also : Pragathi Bhavan : ప్రగతి భవన్ ముందున్న బారిగేట్లును తొలగిస్తున్న పోలీసులు

  Last Updated: 07 Dec 2023, 11:53 AM IST