Revanth Reddy Swearing Ceremony : రేపు రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

రేవంత్ రెడ్డి ని సీఎం (CM) గా అధిష్టానం నిర్ణయం తీసుకోగా..డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ను నిర్ణయించారు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 08:07 PM IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. అంత భావించినట్లే కాంగ్రెస్ విజయ డంఖా మోగించింది. 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి..ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. గత కొద్దీ నెలలుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనేది ఆసక్తి గా మారిన సంగతి తెలిసిందే.

సీఎం రేస్ లో చాలామంది పేర్లే ప్రచారం జరిగినప్పటికీ..అధిష్టానం మాత్రం రేవంత్ (Revanth Reddy) , భట్టి వీరిద్దరిలో ఎవర్నో ఒకర్ని చేయాలనీ భావించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ని సీఎం (CM) గా అధిష్టానం నిర్ణయం తీసుకోగా..డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ను నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం ఎల్లా హోటర్‌లో సీఎల్పీ సమావేశం జరుగగా..నేతలంతా రేవంత్ రెడ్డి ని సీఎం గా చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.

ఇక రేపు రాజ్ భవన్ లో సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ తమిళిసై రేవంత్ ను సీఎం గా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. అలాగే ఈనెల 9న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసారు. అంతే కాకుండా పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా పలువురు కీలక నేతలు హాజరుకాబోతున్నారు.