Praja Deevena Sabha : మోడీ , కేసీఆర్ లను ఉతికిఆరేసిన సీఎం రేవంత్

  • Written By:
  • Updated On - March 6, 2024 / 09:34 PM IST

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి మాజీ సీఎం కేసీఆర్ (KCR) , దేశ ప్రధాని మోడీ (Modi) లపై విరుచుకపడ్డారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని ప్రధానికి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ చేస్తున్న కేసీఆర్ ఫై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ పదేళ్లు సీఎంగా, మోడీ పదేళ్లు పీఎంగా ఉండొచ్చు. పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? పాలమూరు బిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా? ఎవడైనా మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవబాంబులు అవుతారు. తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుంటాం బిడ్డా..’ అంటూ ఘాటుగా హెచ్చరించారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధువారం పాలమూరు(Palamuru )లో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ (Praja Deevena Sabha ) ఏర్పాటు చేసింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక ప్రధాని మోడీ తో సన్నిహితంగా ఉండడం ఫై బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అతిథి మన వద్దకు వస్తే గౌరవించాలని.. ప్రధాని సభకు వెళ్లానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సహకారం అందించకపోతే చాకిరేవుపెడతానని అన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే బిల్లా రంగా సమితి విమర్శించిన సీఎం.. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారని మండిపడ్డారు. ​కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ మందువేసుకొని ఫామ్‌ హౌజ్‌లో ఉన్నావని కేసీఆర్‌ను ఉద్ధేశించి మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

గద్వాలు నీళ్లు తెస్తామన్న కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చిందా అని నిలదీశారు.? ‘అసూయ నా మీద విషం కక్కుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు.. తొంబై రోజుల మా పాలనకు రెఫరెండం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించబోతున్నాం. కేసీఆర్‌కు ఒంట్లో బాగాలేకపోతే.. అసెంబ్లీకి రాకుండా నల్గొండకు ఎందుకు వెళ్లారు..? అని ప్రశ్నించారు. 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పార్టీ ఫిరాయింపులు, పార్టీల్ని చీల్చడమే మీ విధానమా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? మా ప్రభుత్వం మీదకు వస్తే తొక్కుకుంటూ.. బొందపెడతాం. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. ఇది నా ఆన’ అంటూ రేవంత్‌ ధీమా వ్యక్తం చేసారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా అని చెప్పారు. కేసీఆర్ లాగా రాష్ట్రాన్ని మోడీ మోకాళ్ల దగ్గర పెట్టబోను అని హామీ ఇచ్చారు. కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని అన్నారు. మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపారు.

Read Also : Pawan Kalyan : తిరుపతి బరిలో జనసేన అధినేత ..?