పుష్ప 2 ప్రీమియర్ (Pushpa 2 Premiere ) షో సందర్భాంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఓ మహిళా మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ 11 గా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్ట్ సైతం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం తో అల్లు అర్జున్ ఒక్కరోజులోనే బయటకు వచ్చారు. కాకపోతే ఈ కేసు ప్రస్తుతం కోర్ట్ లో కొనసాగుతుండడంతో ఎప్పుడు ఏంజరుగుతుందో అనే టెన్షన్ అల్లు కుటుంబంలో ఇటు చిత్రసీమలో టెన్షన్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించాడని బిఆర్ఎస్ పదే పదే వాదనలు చేస్తూ వస్తుంది.
ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ వ్యవహారం పై సీఎం రేవంత్ స్పందించారు. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని , అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో సీఎం చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ థియేటర్ కి రావొద్దని పోలీసులు చెప్పినా వినలేదు. అలాగే వచ్చారు. అల్లు అర్జున్ లోపలి వచ్చే క్రమంలో ఒక్కసారిగా వందలాది మంది అభిమానులు థియేటర్ లోపలి రావడం తో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు కూడా చనిపోయాడని అంత అనుకున్నారు కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి వెళ్తే పోలీసులతో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు. ఇక తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదని సీఎం ఫైర్ అయ్యారు. ఓ నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు? అని , ఓ బాలుడు నెల రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్లెవరైనా పరామర్శించారా? ఒకపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారు. అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా..? చేయి పోయిందా? కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది ‘ అది సినిమావాళ్లకు కనపడడం లేదా అని సీఎం ప్రశ్నించారు.’తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే’ అని స్పష్టం చేశారు. అంతే కాదు తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఏ సినిమాకీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతివ్వనని తెలిపి షాక్ ఇచ్చాడు. ‘సబ్సిడీలు, ప్రోత్సాహకాలు తీసుకుని సినిమా వాళ్లు వారి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రేక్షకులు, అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించం. మా ప్రభుత్వం ఉన్నంతకాలం మీ ఆటలు సాగవు’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also : TG Assembly: బిఆర్ఎస్ వల్లే ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం – రేవంత్