Revanth Reddy : కేసీఆర్ కామారెడ్డి లో గెలిస్తే.. భూములన్నీ దోచేస్తాడు – రేవంత్

కేసీఆర్ ను గెలిపిస్తే కామారెడ్డిలోని భూములను దోచేస్తాడని రేవంత్ అన్నారు

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 08:45 PM IST

ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్కరు తగ్గడం లేదు..సినిమాలో ఎలాగైతే భారీ డైలాగ్స్ వేస్తారో..అంతకు మించిన డైలాగ్స్ ప్రచారంలో వేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య డైలాగ్స్ వార్ పిక్ స్టేజ్ దాటిపోతుంది. నువ్వా..నేనా అనేంతగా ఒకరికారు విమర్శలు , ప్రతి విమర్శలు , కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా కామారెడ్డి లో ప్రచారం చేసిన రేవంత్ తనదైన శైలీ లో కేసీఆర్ ఫై విరుచుకపడ్డారు.

కామారెడ్డి బరిలో బిఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ బరిలోకి దిగగా..కాంగ్రెస్ నుండి రేవంత్ దిగాడు. శుక్రవారం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి (Revath Reddy) నామినేషన్ వేసిన అనంతరం, బీసీ డిక్లరేషన్ (BC Declaration) పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ను గెలిపిస్తే కామారెడ్డిలోని భూములను దోచేస్తాడని రేవంత్ అన్నారు. 2015లో ఈ ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య సచివాలయం ఎదురుగా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాల కారణంగానే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాని కేసీఆర్ కు.. ఇప్పుడు కోనాపూర్, కామారెడ్డి గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. గజ్వేల్ ను ఏం చేశావ్? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. అక్కడ ప్రాజెక్టులను నిర్మించి బంధువుల భూములను కాపాడి.. పేద రైతుల భూములను ముంచాడని ధ్వజమెత్తారు. అక్కడ అభివృద్ధి చేస్తే ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాలన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్మాలా? అని రేవంత్ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘కేసీఆర్ మీద గంపగోవర్థన్ కూడా ఫీల్ అవుతున్నడు. నా సీటే కావాల్సొచ్చిందా? అని తిట్టుకుంటున్నడు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే లక్ష కోట్లు దోచుకున్నవు. హైదరాబాద్ లో వేల ఎకరాలు, జన్వాడ ఫాంహౌస్ లాంటివి ఎన్నో కట్టుకున్నరు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే లక్ష కోట్లు దోచుకున్నవు. హైదరాబాద్ లో వేల ఎకరాలు, జన్వాడ ఫాంహౌస్ లాంటివి ఎన్నో కట్టుకున్నరు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు. ఆ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయావు. గ్రూప్స్ క్వశ్చన్స్ పత్రాలు జిరాక్స్ సెంటర్స్‌లో కనిపించాయి. సన్నాసి నీకు 10 ఏళ్లు ఇస్తే నీ యవ్వారం ఇట్ల ఏడ్చింది అని రేవంత్ మండిపడ్డారు.

Read Also : CM Jagan Convoy Accident : పెను ప్రమాదం నుండి బయటపడ్డ సీఎం జగన్