Site icon HashtagU Telugu

Revanth Reddy : రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే – రేవంత్ రెడ్డి

Revanth Nzd

Revanth Nzd

తెలంగాణ (Telangana) లో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అని..కేసీఆర్ (KCR)కు పదేళ్ల అవకాశం ఇస్తే హామీలు నెరవేర్చకపోగా..రాష్ట్రాన్ని అప్పుల్లో పడేశారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ విజయభేరి యాత్ర నిర్వహిస్తూ ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ..కాంగ్రెస్ హామీలను ప్రజలను వివరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క కాంగ్రెస్ హామీలను తెలియజేస్తూనే..మరోపక్క అధికార పార్టీ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ తన దూకుడు ను కనపరుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ (Revanth Reddy Speech) ..తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని… కేసీఆర్ గుర్తుంచుకో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కు 10 ఏళ్లు అవకాశం ఇస్తే.. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Goverdhan)..వేల కోట్లు సంపాదించుకున్నారని..రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. కవితను ఓడించినప్పటి నుంచి నిజామాబాద్ పై కేసీఆర్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు రేవంత్ వివరించారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలు రూ. 2500 ఆర్థికసాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రైతులకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read Also : KCR : కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో 5 గంటల క‌రెంటే – కేసీఆర్