Site icon HashtagU Telugu

TS : గతంలో మంత్రులకు సైతం ప్రవేశం లేని ప్రగతి భవన్ కు ఈరోజు సామాన్య ప్రజలు వస్తున్నారు – రేవంత్

Revanth Pragathibhavan

Revanth Pragathibhavan

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడివేడిగా నడిచాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సాగాల్సిన సభ… పంచ్‌ డైలాగ్‌లు, ఘాటైన మాటల తూటాలతో హీటెక్కిపోయింది. 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసం తప్ప..ఏమి జరగలేదంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కేటీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సైతం ధీటుగా సమాధానం చెపుతూ వచ్చింది.

ఇక సీఎం రేవంత్ సైతం కేటీఆర్ ప్రశ్నలకు సమాదానాలు చెపుతూ..పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో జరిగిన అవమానాలు , అవినీతి , ఇలా అనేక అంశాల గురించి మాట్లాడారు. ప్రగతి భవన్ కు సంబదించిన విషయాలను సైతం చెప్పుకొచ్చారు. ప్రజలు కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఇకనైనా గుర్తించాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసిన ప్రజలే మమ్మల్ని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తెచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రగతిభవన్ ముందు ఉన్న గేట్లను బద్ధలుకొట్టి, మేం ప్రజలకు అవకాశం ఇచ్చామన్నారు. గతంలో సామాన్యులకు మాత్రమే కాదు, నేతలకు సైతం ఇందులోకి ప్రవేశం ఉండేది కాదన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తే.. ఒక హోం గోర్డు మీకు ఇక్కడ అనుమతి లేదని చెప్పారని రేవంత్ గుర్తుచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈటల రాజేందర్ వెళ్లినప్పుడు సైతం ఆయనకు సైతం ప్రవేశం లేదని, సహచర మంత్రిని అవమానాలకు గురిచేశారు. ఈ విషయాన్ని 4 కోట్ల ప్రజలకు ఈటల చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా యుద్ధనౌక, ఉద్యమ నేత గద్దర్ ను సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మండుటెండలో నిల్చుంటే.. ఆయనకు సైతం ప్రవేశం లేని ప్రజాభవన్ లోకి రాష్ట్ర ప్రజలు అందరికీ ప్రవేశం తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉద్యమనేతలకు, మంత్రులకు సైతం ప్రవేశం కల్పించిన ప్రగతి భవన్ గేట్లు బద్ధలుకొట్టి తాము రాష్ట్ర ప్రజలందరికీ ప్రవేశం కల్పించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రి వర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు . ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పించి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే గవర్నర్ ప్రసంగంలో పెట్టామన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పడైనా అమరవీరుల కుటుంబీకులను ప్రగతి భవన్ కు పిలిచి గౌరవించారా ? కనీసం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డల కుటుంబాలను ఎప్పడైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయలేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో టిఎస్పిఎస్ పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పెట్టి అమ్మారన్నారు. కనీసం పదవ తరగతి పరీక్షలు సైతం సరిగ్గా నిర్వహించడం చేతకాలేదని దయ్యబట్టారు. ఇక అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు.

Read Also :