టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఫ్యామిలీ కరెంట్ ఊడగొడతాం అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచారాన్ని మరింత జోష్ పెంచుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) – బిఆర్ఎస్ పార్టీ (BRS) లు ఎక్కడ తగ్గడం లేదు..ఏ వేదికను వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం అధికార పార్టీ కి దీటుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ విజయ భేరి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేస్తున్నాడు రేవంత్. ఇప్పటికే అనేక నియోజకవర్గాలను కవర్ చేసిన ఈయన..నేడు స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచారం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎవడిపాలైంది, ఇప్పుడు ఎవడేలుతున్నడు అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు గుంజుకున్న వ్యక్తి ఇక్కడి ఎమ్మెల్యే, అదేమని ప్రశ్నించిన వారిని పోలీస్ బూటు కాలితో తన్నించిన వ్యక్తి అరూరి రమేష్ అని వర్ధన్నపేట్ సభలో రేవంత్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికలు వస్తున్నాయనే ల్యాండ్ పూలింగ్ జీవోను తాత్కాలికంగా ఆపారని … నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పాడు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (Kaleshwaram Lift Irrigation Project) పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది.. సిందిళ్లకు దిక్కులేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండు. బుద్ది ఉన్నవాడు ఎవడైనా ఇసుకపై బ్యారేజీ కడతాడా అని కేసీఆర్ ను నిలదీశారు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే.. ప్రజలకు ఎందుకు చూపించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
యువకులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో సోనియా (Soniya) తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. ఉద్యోగాలు రావనే భయంతో యువత అడవిబాట పట్టే అవకాశముందని పేర్కొన్నారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓట్లన్నీ డబ్బాలో వేస్తే కేసీఆర్ మూటగట్టుకుని పోతారని అన్నారు. కేసీఆర్ చుట్టాలొచ్చి కామారెడ్డిలో భూములు గుంజుకుంటారని ఆరోపించారు.
కేసీఆర్‌ను తరిమికొట్టడానికే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను వెంటాడటానికే కాంగ్రెస్ అధిష్ఠానం తనను పంపించిందని పేర్కొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు బీఆర్ఎస్‌పై నిప్పులు చేరిగారు.
Read Also : KTR : బిజెపి , కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులోళ్లతో పోల్చిన కేటీఆర్