Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి మరింత ముందుకు తీసుకువెళ్లాలి: పవన్ కళ్యాణ్

నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Nasser Reacts On Pawan Kalyan Comments Over Tamil Industry

Nasser Reacts On Pawan Kalyan Comments Over Tamil Industry

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు అంటూ రియాక్ట్ అయ్యారు. ‘‘రేవంత్ తో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు’’ అని పవన్ అన్నారు.

‘‘తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత..

ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం… అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను’’ అంటూ పవన్ రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, షెడ్యూల్ ఇదే

  Last Updated: 07 Dec 2023, 04:50 PM IST