Site icon HashtagU Telugu

Revanth Reddy : కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు.. ఉన్న సెక్యూరిటీ తీసేశారు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..

Revanth Reddy Security Removed and he Fires on Telangana Government

Revanth Reddy Security Removed and he Fires on Telangana Government

తెలంగాణ(Telangana) కాంగ్రెస్(Congress) చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండు నెలల క్రితమే తనకు సెక్యూరిటీ(Security) పెంచమని కోర్టుని ఆశ్రయించగా అందుకు కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ పెంచకపోగా ఉన్న సిబ్బందిని తగ్గించారు. మొదట 8 మంది గన్‌మెన్లు ఉండగా తర్వాత దానిని నలుగురికి కుదించింది ప్రభుత్వం. తాజాగా రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉన్న సెక్యూరిటీని కూడా తీసేశారు.

రేవంత్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన సెక్యూరిటీ సిబ్బంది రావడం మానేశారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని విమర్శలు చేస్తున్నారు. రెండు రోజులుగా రేవంత్ సెక్యూరిటీ లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా దీనిపై రేవంత్ రెడ్డి మీడియా ముందు స్పందించారు.

రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విషయం గురించి మాట్లాడుతూ.. కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. అయినా నేను ప్రజల మనిషిని, నాకు సెక్యూరిటితో పనిలేదు. నేను సెక్యూరిటీ లేకుండానే ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? నన్ను ఓడించడానికి పోలీసులను కేసీఆర్ వాడుకున్నారు. సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే నేను భయపడేవాడ్ని కాదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. వాళ్ళే నా సెక్యూరిటీ అని అన్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ స్పందిస్తారేమో చూడాలి.

 

Also Read : TSRTC Bill : తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు న్యాయ‌ ప‌రీక్ష‌