Revanth Reddy : రాజగోపాల్ రెడ్డిని…ఇక నుంచి ఆర్‌జీ పాల్ అని పిలవండి..!!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడు అసెంబ్లీకి త్వరలోనే జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
revanth

revanth

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడు అసెంబ్లీకి త్వరలోనే జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆరెస్ లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఉపఎన్నికల్లో పార్టీ అనుబంధ సంఘాలే కీలకంగా వ్యవహారించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తర్వాత రాజగోపాల్ రెడ్డిపై సెటైర్లు సందించారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని ఆర్ జీ పాల్ అని పిలవాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. ఇప్పటిదాక మనకు కేఏపాల్ ఉన్నారని…ఇకపై మన ఆర్ జీ పాల్ కూడా ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి చర్యలు కామెడీని తలపిస్తున్నాయన్నారు.

  Last Updated: 11 Aug 2022, 06:17 PM IST