హైదరాబాద్ (Hyderabad) అంబర్ పేట్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కుక్కలు తమపై దాడి చేస్తున్నాయని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశామని స్థానికులు వాపోయారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పందించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదని, క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుందనీ, కుక్కలు ఆకలితో ఆ పిల్లవాడిని తినేశాయని మేయర్ అంటున్నారు. కుక్కలకు ఆపరేషన్ చేస్తామని మంత్రి చెబుతున్నారు. జరిగింది ఒకటైతే, ప్రజాప్రతినిధులు చెప్పేది మరొకటి’ అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలన.. కుక్కల పాలన.. మనుషులు చనిపోతే కుక్కలకు ఆపరేషన్ ఏంటి? మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారు. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు వీధికుక్కల బారిన పడి చనిపోతే ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోంది. నడిరోడ్డుపై కుక్కలు తినే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిందన్నారు. ప్రదీప్ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు.
హైదరాబాద్ అంబర్ పేటలో ప్రదీప్ (5) అనే బాలుడు కుక్కల దాడి (Street Dogs) లో మృతి చెందిన విషయం ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది. ఇందల్వాయికి చెందిన గంగాధర్ హైదరాబాద్ హెచ్‌వైడీలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం కొడుకును తన పని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు (Street Dogs) ఒక్కసారిగా బాలుడిపై దాడి (Attack) చేశాయి. చిన్నారిని వీధి కుక్కలు వెంటపడి కరిచి చంపాయి. అభం శుభం తెలియని చిన్నారి (Child) మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. హైదరాబాదులోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై కేటీఆర్, హైదరాబాద్ మేయర మాటలకు పరిమితమయ్యారని ప్రతిపక్షాలతో పాటు పౌరులు కూడా మండి పడుతున్నారు.
Also Read: Kangana Ranaut: గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కంగనా రనౌత్!