Site icon HashtagU Telugu

Revanth Reddy: ‘చండూర్’ ఘటనపై రేవంత్ సీరియస్!

Revanth

Revanth

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతోంది. నిన్నటి వరకు మందు, విందు రాజకీయాలతో హాట్ టాపిక్ గా మారిన మునుగోడులో నేడు దాడులకు దిగే పరిస్థితులు నెలకొన్నాయి. నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రచార సామాగ్రి కాలిపోయింది. రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారని  కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని రేవంత్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. బీజేపీ లకు వణుకు పుట్టింది అని, మునుగోడులో కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణ చూసి  ఓర్వలేక పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Trs, బీజేపీ కుమ్మక్కు అయ్యి మా క్యాడర్ ని బెదిరించే కుట్రలు చేస్తున్నారని, బెదిరిస్తే బెదిరేది లేదు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయలని, లేదంటే sp కార్యాలయం ముందు నేనే ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చిరంచారు.  జిల్లా వ్యాప్తంగా trs.. బీజేపీ లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీపీసీ చీఫ్ పిలుపునిచ్చారు. కాగా ఈ ఘటనకు ముందే మునుగోడు పే కాంట్రాక్టర్ అంటూ పోస్టర్స్ ఏర్పాటుచేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.