CM Revanth Reddy : LB స్టేడియం కు చేరుకున్న రేవంత్ రెడ్డి

ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ..LB స్టేడియం కు చేరుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Revanth At Lb

Revanth At Lb

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ..LB స్టేడియం కు చేరుకున్నారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలతో కలిసి రేవంత్ ఒకే వాహనంలో బయలుదేరి..స్టేడియం కు చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వేలాదిమంది ఈ వేడుకను చూసేందుకు తరలివచ్చారు. LB స్టేడియం చుట్టూ కాంగ్రెస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది.

ఇక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీగా నాయకుడిగా ప్రమోట్ చేస్తూ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మధ్యాహ్నం 1:04 నిమిషాలకు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా వేదికపైకి చేరుకున్నారు.

  Last Updated: 07 Dec 2023, 12:50 PM IST