Site icon HashtagU Telugu

Davos : హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్..ఘనస్వాగతం పలికి శ్రేణులు

Cm Revanth Reddy Reached In

Cm Revanth Reddy Reached In

దావోస్ పర్యటన(Davos Tour)ను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )కి శంషాబాద్ ఎయిర్‌పోర్టు(RGI Airport)లో ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు సీఎం రేవంత్‌కు పూల వర్షం కురిపిస్తూ, జయజయహే తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంలో సీఎం బృందం విజయవంతమయ్యారన్న సంతోషంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Astrology : ఈ రాశివారు నేడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి..!

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సత్తా చాటారు. ఈ పర్యటనలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి సాధించి, సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అలాగే 46 వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది గత ఏడాది వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే మూడు రెట్లుగా ఉండడం విశేషం. రైజింగ్ తెలంగాణ బృందం ఈ సదస్సులో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ నేతృత్వంలో సమావేశాలు జరగ్గా, రాష్ట్ర ఖ్యాతి మరింత పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం భారీ పెట్టుబడులు సాధించడం, పారిశ్రామిక వర్గాల దృష్టిని ఆకర్షించడం ప్రత్యేకంగా నిలిచింది.

Mysterious Disease: జ‌మ్మూక‌శ్మీర్‌లో మిస్ట‌రీ మ‌ర‌ణాలు.. కార‌ణం ఏంటంటే?

గత ఏడాది దావోస్ పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రావడం మాత్రమే జరిగితే, ఈసారి సాధించిన పెట్టుబడులు మూడింతలు అధికం కావడం రాష్ట్రానికి గొప్ప విజయం. ముఖ్యంగా ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు మరింతగా ప్రవహించడం గమనార్హం. సీఎం రేవంత్ ఈ విజయంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలను తెరచారు. తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తూ, పెట్టుబడుల రంగంలో దార్శనికతను చూపించారనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ పర్యటన ఫలితంగా రాష్ట్రానికి పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో మరింత వృద్ధి సాధ్యం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.