Site icon HashtagU Telugu

Revanth Reddy: సీఎంఓలో మహారాష్ట్ర ఎంప్లాయ్ ఏంటిది కేసీఆర్: రేవంత్

Revanth Reddy

Whatsapp Image 2023 05 05 At 4.37.16 Pm

Revanth Reddy: తెలంగాణ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ పై ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల వ్యక్తుల్ని తీసుకొచ్చి సీఎంఓలో నియమించారంటూ ఆరోపించారు రేవంత్. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా నిరుద్యోగులు తొమ్మిదేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే సీఎం కెసిఆర్ కార్యాలయంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని ఎలా నియమిస్తారని మండిపడ్డారు.

మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి, లక్షాయాభైవేల జీతం ఇచ్చి సీఎంఓలో అపాయింట్ చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి జివో బయటపెట్టకుండా దాచేశారన్నారు. ఇదంతా పబ్లిక్ డొమైన్ లో లేకుండా ఆ జీవోని భద్రంగా ఉంచారని తెలిపారు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి కి తెలంగాణ ప్రజల సొమ్ముని ఎలా వినియోగిస్తారంటూ ప్రశ్నించారు. తెలంగాణలోని లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న కెసిఆర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని ప్రైవేట్ సెక్రటరీగా ఎలా నియమిస్తారని ఫైర్ అయ్యారు.

సీఎం కెసిఆర్ తొమ్మిదేళ్ల పాలన విఫలమైందని తేల్చేశారు. ప్రభుత్వ పరీక్ష పాత్రలను లీక్ చేయడం, వాటిని మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులు నష్టపోతే కనీసం ఆదుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టారని అన్నారు. ఇక ఇటీవల అకాల వర్షాల కారణంగా తెలంగాణాలో పంట నష్టం జరిగిందని, రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, పండించిన పంట,తడిసి ధాన్యం కొనట్లేదని విమర్శించారు. మే 8న సరూర్ నగర్లో జరగనున్న నిరుద్యోగ మార్చ్ ను విజయవంత చేయాలని పిలుపునిచ్చారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.

Read More: Whatsapp: వాట్సాప్ లో తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్స్.. లిఫ్ట్ చేసారంటే అంతే సంగతులు?

Exit mobile version